Thursday, January 23, 2025

మంత్రుల పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -
  • 10న మత్స్యకార సహకార సంఘ సభ్యుల గుర్తింపు కార్డుల పంపిణీ
  • కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్

సిద్దిపేట అర్బన్: ఈ నెల 10న మత్స్యకార సహకార సంఘ సభ్యుల గుర్తింపు కార్డులను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు మంత్రుల పర్యటనల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మత్స్య శాఖ, మునిసిపల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని చింతల్ చెరువులో చేపలు వదిలే కార్యక్రమం సందర్భంగా చెరువు కట్టపైన ఎలాంటి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నందున మంత్రులు చేపలు వదిలే చోట బారికేడ్ ఏర్పాటు చేయ్యాలని తెలిపారు. పత్తి మార్కెట్ లో సుమారు 8000 మందితో బారి బహిరంగ సభ ఏర్పాట్లలో స్టేజ్ పైన వి-విఐపి సిట్టింగ్, కింద ప్రజాప్రతినిధులు, మీడియా గ్యాలరి, సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాలని ఎజెన్సీ కి తెలిపారు.

ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. అనంతరం జిల్లాలోని కేవలం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని గ్రామాల్లో గల మత్స్య కార సహకార సంఘాల సభ్యులందరికి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మత్స్య కార సహకార సంఘాల సభ్యులకు సులభంగా తెలిసే విధంగా సభ ప్రాంగణంలో ప్రతి గ్రామం వారిగా శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎజెన్సీ కి తెలిపారు.

సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఎంపిడిఒ, ఎంపిఓలు మీ మండలాల్లో ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలతో కలిసి మత్స్య కార సహకార సంఘాల సభ్యులు గుర్తింపు కార్డుల పంపిణీకి గ్రామాల వారిగా ప్రక్కనే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలలో ప్రతి సొసైటీ సభ్యునికి కార్డును పంపిణీ చెయ్యాలి. కార్డు పంపిణీలో గందరగోళం జరగకుండా నేరుగా సభ్యునికే కార్డు అందజేసి సంతకం తీసుకోవాలన్నారు. అనంతరం అందరికీ భోజన ఏర్పాట్లు సైతం సభ పూర్తి అయ్యేలోపూ చేయాలని సూచించారు. సొసైటీ సభ్యులు కార్డు తీసుకుని భోజనం చేసి వెళ్ళేలా ఏర్పాట్లు ఉండాలని ఎజెన్సీ కి తెలిపారు.

భోజనాలు చేసే ప్రాంతంలో మార్కెట్ పారిశుద్ధ్య, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల అక్కడే ఉంటి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, బందోబస్తు సంబంధిత ఏర్పాట్లు చూడాలని పోలిస్ అధికారులకు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ప్రజాప్రతినిధులు వేలేటి రాధకృష్ణాశర్మ, కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News