Wednesday, January 22, 2025

15న ఐటి టవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -
  • పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట: ఈ నెల 15న ఐటి టవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధ్దం చేయాలన్నారు. సిద్దిపేట ఐటి టవర్ పక్కనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్ద మొత్తంలో వాహనాల పార్కింగ్ వాటర్ ప్రైప్ టెంట్ అందరికి సరిపడే విధంగా బోజన సదుపాయం ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీలకు తెలిపారు. టిటిటవర్ బయట, లోపల ఎలాంటి చెత్తచేదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. లోపల కంప్యూటర్ మిగతా పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. చూడగానే అర్థ్దం అయ్యే విధంగా సైన్ బోర్డులు అందంగా కనిపించేటట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించారు.

అనంతరం 13న పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహస్తున్న జాబ్ మేళా కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ దేశాల నుంచి వచ్చే కంపెనీలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి జాజ్‌మేళాకు విచ్చేసే అభ్యర్థ్ధులకు కోరకు వివిధ కంపెనీల స్టాళ్లను ఏర్పరిచి నియామకాలు చేపడతామని తెలిపారు. కంపెనీ ప్రతినిధులకు సిబ్బందికి భోజన వసతి మిగతా ఏర్పాట్లను చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్‌కు తెలిపారు. వచ్చే కంపెనీలకు స్టాల్స్ ఏర్పాటు , యువతి, యువకులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐటి అండ్ టాస్క్ ప్రతినిధులతో కల్సి స్టాల్స్ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. యువతి యువకులు ఇంటర్వూలో పాల్గొనేలా గైడ్ చేసే ప్రత్యేక వలంటరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, మజ్జిగ, స్నాక్స్ ఏర్పాటు చేయాలని ఏజెన్సీలకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News