Sunday, January 19, 2025

పార్లమెంట్ భద్రతపై సమీక్షకు ఉన్నతాధికార కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :పార్లమెంట్ భద్రతపై సమీక్షించడానికి ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం వెల్లడించారు. ఈ మేరకు ఎంపీలకు లేఖల ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ లేఖలో తెలిపారు. కమిటీ సమర్పించే నివేదికను పార్లమెంట్‌లో సభ్యులకు తెలియజేస్తామని స్పీకర్ వివరించారు. కేంద్రహోం మంత్రి త్వశాఖ నియమించిన ఈ కమిటీతోపాటు తాను కూడా ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశానని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ కాంప్లెక్సు భవన సముదాయంలో భద్రతకు సంబంధించి వివిధ అంశాలను సమీక్షిస్తుందని, సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News