Monday, December 23, 2024

జూన్ నెల ఉత్పత్తి, ఉత్పాదకతపై సమీక్ష

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం సింగరేణి : కొత్తగూడెం ఏరియా 2023/24 ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు ఏరియాకు నిర్ధేశించబడిన 09.89 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 11.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి119 శాతం ఉత్పత్తి లక్షాన్ని సాధించడం జరిగిందని ఏరియా జీఎం ఎం.షాలెం రాజు తెలిపారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023=24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు 30.16 లక్షల టన్నులకు గాను 34.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 115 శాతం ఉత్పత్తి లక్షాన్ని సాధించామని తెలిపారు.జూన్ నెలలో రోడ్డు, రైల్ ద్వారా 12.96 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందని అన్నారు.

ఏరియాలో ఇప్పటి వరకు 511 మందికి కారుణ్య నియామకాల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, 58 మందికి ఉద్యోగాలకు బదులు ఏక మొత్తం చెల్లించడం జరిగిందని ఒకరికి నెలవారి భృతి మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా పది లక్షల వరకు ఇంటి రుణంపై వడ్డీ కోసం మంజూరు పత్రాలు తీసుకున్న వారు 2022/23 ఆర్థిక సంవత్సరానికి గాను మే, జూన్ నెలలో 90 మందికి చెల్లించడం జరిగిందని, మిగిలిన వారికి సరైన పత్రాలు లేనిచో జూలై నెల జీతంతో ఆగస్టు నెలలో ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ వై.రఘురామిరెడ్డి, ఏజీఎం పర్సనల్ పి.సామ్యుల్ సుధాకర్, ఏజిఎం సివిల్ సిహెచ్.రామకృష్ణ, డిజీఎం యోహన్, పిఒ వికేఓసి రమేష్, పివికె ఓ ఏజెంట్ బి. రవీందర్, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ తావుర్య, సుధాకర్, సాగర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News