Sunday, December 22, 2024

హిమాచల్‌లో పాత పింఛన్ విధానం పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత పింఛన్ విధానం పునరుద్ధరణకు శుక్రవారం ఆమోదం తెలిపింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చేదిశగా ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తొలి సమావేశంలోనే పాత పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్)ను తిరిగి ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సుఖు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం పునరుద్ధరించేందుకు విస్తృతంగా అధ్యయనం చేశామన్నారు.

ప్రభుత్వ ఆర్థిక విభాగాలకు చెందిన అధికారులు పాత పింఛన్ తిరిగి అమలుచేసేవిషయంలో కొన్ని మినహాయింపులు అమలు చేయాలని సూచించారు. కానీ ఆ సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)లో ఉన్న ఉద్యోగులందరు ఓపిఎస్ వర్తిస్తుందని సుఖ్విందర్‌సింగ్ స్పష్ట చేశారు. ఉద్యోగులతో సంప్రతింపులు జరిపి విధి విధానాలు ప్రకటిస్తామని సిఎం తెలిపారు. ఓట్లుకోసం ఓపిఎస్‌ను పునరుద్ధరించడం లేదని ఉద్యోగుల సామాజిక భద్రత, రక్షణ, ఆత్మగౌరవం కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హిమాచల్‌ప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల సమావేశంలో ఓపిఎస్ పునరుద్ధరణ నిర్ణయాన్ని సిఎం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News