Wednesday, January 22, 2025

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మన ఊరు మన బడి పథకంలో భాగంగా మంగళవారం మండలంలోని నందిగామ గ్రామంలో పలు పథకాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో అధునాతన సౌఖర్యాలు ఏర్పాడ్డాయన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులు సంతోషంగా ఉన్నారన్నారు. పాఠశాల్లో చేపట్టిన అధునాతన సౌకర్యాలతో విద్యార్థులు మంచి విద్యనభ్యసించుకో కలుగుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్యాసంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో పేద విద్యార్థులు చదువుకునే వీలుగా అన్ని ఏర్పాట్లు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ చదువులు చదివిస్తున్న ఘనత మన సిఎంకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమ ంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉమాపతి గోపాల్, ఎంపిటిసి నాగజ్యోతి లక్ష్మణ్, నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News