Monday, December 23, 2024

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానాలు, టి డయాగ్నొస్టిక్ సెంటర్లు , ఆసుపత్రిల అప్ గ్రేడిషన్‌తో రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల చంద్ర గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య ఆరోగ్యదినోత్సవంలో ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ సర్కారు దావఖానాల్లోనే నేడు డయాలసిస్ సేవలు సైతం అందుతున్నాయని, టీ డయాగ్నస్టిక్స్ సెంటర్లో 55 రకాలకు పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవలే జడ్చర్లలో వంద పడకల దవాఖానా ప్రారంబించుకున్నామని, డయాలసిస్ ఐసియూ, ఎమర్జెన్సీ కేర్ వంటి సేవలతో పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానాలకు ఎర్రగొలి, పచ్చగొలి తప్ప సరైన వైద్యం కూడా అందేది కాదన్నారు. ప్రసుత్తం దవాఖానాలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో ప్రజలే గమనించాలన్నారు. పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఈఓ జ్యోతి జడ్పి వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీత్ చందర్ , మార్కెట్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, ముడా డైరెక్టర్లు ప్రితం, ఇమ్ము కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రమేష్ టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News