Wednesday, January 22, 2025

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ

- Advertisement -
- Advertisement -
Revanth Reddy is contesting from Kodangal in 2023 Polls
రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గంలో డిజిటల్ మెంబర్‌షిప్ సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో కొడంగల్‌కు తాను కొత్త అయినా గెలిపించారని, కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా.. వరుసగా రెండుసార్లు కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశకు లోనుకాకుండా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా, టిపిసిసి చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాను పోటీ చేసే స్థానంపై రేవంత్‌రెడ్డి అప్పుడే క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News