Saturday, January 18, 2025

రేపు కోల్‌కతా మెడికో హత్యాచారం కేసుపై తీర్పు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీర్పు శనివారం వెలువడనున్నది. నిరుడు ఆగస్టు 9న ఉత్తర కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడని నగర పోలీసు శాఖకు చెందిన పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌పై అభియోగం మోపారు. సీల్డా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టు ముందు విచారణ మొదలైన 57 రోజుల తరువాత తీర్పు శనివారం వెలువడనున్నది. కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులు ఆసుపత్రి సెమినార్ గదిలో నుంచి మెడికో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మరునాడు ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు.

కలకత్తా హైకోర్టు ఆ తరువాత కేసును సిబిఐకి బదలీ చేసింది. నిందితునికి మరణ శిక్ష విధించాలని సిబిఐ కోరింది. డాక్టర్ హత్యాచారంపై రహస్య విచారణ నవంబర్ 12న మొదలైంది. 50 మంది సాక్షులను విచారించారు. కేసులో రాయ్ విచారణ ఈ నెల 9న ముగిసింది. ఈ అఘాయిత్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ప్రజ్వరిల్లాయి, హతురాలికి న్యాయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గట్టి భద్రత ఏర్పాట్లు కోరుతూ కోల్‌కతా జూనియర్ డాక్టర్లు సుదీర్ఘ కాలం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బిజెపితో సహా ప్రతికూల రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News