Wednesday, January 22, 2025

ప్రపంచంలోనే చాలా పంక్చువల్ హైదరాబాద్ విమానాశ్రయం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విమానయాన విశ్లేషణ సంస్థ ‘సిరియమ్’ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి 2023లో 90.43 శాతం ఆన్‌టైమ్ పనితీరును కనబరిచింది. నివేదికల ప్రకారం 90 శాతం మార్కును చేరుకున్న ప్రపంచంలోని ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం కావడం విశేషం.సిరియమ్ ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ విమానాలను అంచనా వేసింది(అసెస్డ్). హైదరాబాద్ విమానాశ్రయం ‘ప్రపంచ విమానాశ్రయాలు’, ‘పెద్ద విమానాశ్రయాలు’ కేటగిరి రెండింటిలోనూ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ ఘనతపై జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిఈవో ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ ‘సంవత్సరాలుగా మేము తాజా సాంకేతిక ఆవిష్కరణలను అమలు చేశాము. ఉత్తమ కార్యాచరణ చర్యలను మెరుగుపరచాము, విమానాశ్రయ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించాము’ అన్నారు.

ప్రారంభమైనప్పటి నుండి జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని విమానాశ్రయ రంగానికి అనేక మొదటి రకం సాంకేతికతల ఆవిష్కరణలను అందించింది. ఇందులో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్(ఎఒసిసి) ఉన్నాయి. అంతేకాక ఈ విమానాశ్రయంలో ఆధునిక ప్రయాణికుల సమాచార వ్యవస్థలు, సాంకేతిక కార్యక్రమాలు ఉన్నాయి.

RGIA

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News