మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియాలోనే బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డును ఆర్జీఐఏ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుకుంది. ఈ విషయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ గురువారం పేర్కొంది. బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టు అవార్డుతో పాటు బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్ అవార్డును కూడా ఆర్జీఐఏ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానికర్ మాట్లాడుతూ బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు, బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఆర్జీఐఏ నుంచి ప్రయాణించిన ప్రయాణికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్టు సిబ్బందికి స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాయిస్టెడ్ శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాదికి గాను బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టు అవార్డు, బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్ అవార్డు రావడం గొప్ప విషయమన్నారు. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది ఎయిర్‌పోర్ట్టు కస్టమర్ సంతృప్తి ఆధారంగా ఈ సర్వే నిర్వహించి అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాదికి గానూ 550 ఎయిర్‌పోర్టుల్లో ఆరు నెలల పాటు సర్వే నిర్వహించారు. కస్టమర్ల అనుభావాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చెక్ ఇన్ నుంచి సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ దాకా అన్ని విషయాలపై సమాచారాన్ని సేకరించి, పరిశీలించి అవార్డులను ప్రకటించారు.