Sunday, December 22, 2024

ఆర్జియూకెటి కౌన్సెలింగ్ ప్రక్రియ సన్నాహక సమావేశం

- Advertisement -
- Advertisement -

బాసర : ఆర్జియూకెటి బాసర ఆరు సంవత్సరాల సమీకృత విధానంలో విద్య అభ్యసించడానికి ప్రొవిజినల్ లిస్టును విడుదల చేసిన విషయం విధితమే. ఈ ప్రక్రియలో భాగంగా నేడు పరిపాలన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్‌నందు కౌన్సెలింగ్ ప్రక్రియ సన్నాహక కార్యక్రమాన్ని వైస్ చాన్సలర్ వెంకటరమణ అధ్యక్షతన డైరెక్టర్ సతీష్ కుమార్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, ఉద్యోగులతో వైస్ చాన్సలర్ వెంకటరమణ సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 7వ తేది నుండి 9వ తేది వరకు జరగనున్న కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగులు నిర్వ ర్తించిన విధులను సూచించారు. అకాడమిక్ ఇయర్ ్రప్రారంభమై సందర్బంలో తరగతులు జరుగుతున్న విధానాన్ని అధ్యాపకుల పాత్ర విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై ఆయా శాఖాధిపతులకు సూచనలు చేశారు. అనంతరం నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యంలో రూ. 30 వేలు మృతురాలు విద్యార్థిని బూర లిఖిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News