Friday, December 20, 2024

ఐటి శాఖ మంత్రిని కలిసిన ఆర్జియూకెటి విసి

- Advertisement -
- Advertisement -

బాసర : ఆర్జియూకెటి బాసర వైస్ చాన్సలర్ వెంకటరమ బుధవారం హైదరాబాద్‌లోని మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావును మర్యాదపూర్వకంగా కలిసి ఆర్జియూకెటిలో ఈ నెల 20,26వ తేదీలలో జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం, ఆర్జియూకెటి ప్రగతి దినోత్సవం గూర్చి సవివరంగా వివరించారు. ఆర్జియూకెటిలో విద్యార్థుల సంక్షేమం గూర్చి చేపడుతున్న అభివృద్ధ్ది కార్యక్రమాల గూర్చి భవిష్యత్‌కార్యాచరణ గూర్చి పలు అంశాలపై చర్చించారు.

సంవత్సర కాలంలో వివిధ సంస్థలతో విద్యాసంస్థలతో జరిగిన అవగాహన ఒప్పందం గూర్చి వివరించారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఆర్జియూకెటిని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఆర్జియూకెటి బాసరను ఉన్నత విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరపు సహయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఆర్జియూకెటి విద్యార్థుల, ఉద్యోగుల రూపొందించిన త్రిడి ప్రింటింగ్ గురించి మంత్రి కెటిఆర్ కు వివరించారు. స్పందించిన మంత్రి కెటిఆర్ ఇలాంటి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని విసికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News