Thursday, December 26, 2024

వైఎస్ జగన్‌పై మూవీ

- Advertisement -
- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్శ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలో ఏపి సిఎం వైయస్ జగన్ పైన సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. ఇప్పటివరకు ముఖ్య నేతల జీవిత చరిత్రపై సినిమా తీసిన ఆర్జీవీ, జగన్‌పై తీయబోయే ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రజల్లో చర్చ నడుస్తున్నట్లుగా ఇది జగన్ జీవిత చరిత్ర కాదని, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ చుట్టూ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఈ సినిమా తెరకెక్కుతుందని ఆర్జీవీ స్పష్టం చేశాడు.

కొద్ది నెలల క్రితం జగన్ తో దాదాపు 40 నిమిషాల పాటు ఆర్జీవి భేటీ కావడం విశేషం. ‘వ్యూహం’ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్‌లో వస్తుందని ఆర్జీవీ అన్నాడు. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి త్వరలో షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News