Sunday, December 22, 2024

సినీ నిర్మాతపై పోలీసులకు ఆర్జివి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

RGV police complaint against film producer

తప్పుడు కేసు వేశారని ఫిర్యాదు

హైదరాబాద్: డబ్బులు ఇవ్వాలని కోర్టులో నకిలీ కేసు వేసిన సినీ నిర్మాతపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ లడ్కీః ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమాను సినీ నిర్మాత శేఖర్ రాజు సివిల్ కోర్టులో కేసు వేసి విడుదలను ఆపివేశారని తెలిపారు. నిర్మాత శేఖర్ రాజుకు తాను బాకీ లేనని తప్పుడు కేసు వేశాడని తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించడంతోపాటు సినిమా విడుదల నిలిచిపోయేలా చేశాడని తెలిపారు. సినిమాపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. తప్పుడు కేసు వేసిన శేఖర్‌రాజుపై కేసు నమోదు చేయాలని పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్‌ను కోరారు. సినిమా నిర్మాణం కోసం చాలామంది పనిచేస్తారని, నటులు, సాంకేతిక నిపుణులు ఇలా ఎంతో మందికి సంబంధించిన విషయమని తెలిపారు. ఒకరిద్దరి మధ్య ఉన్న విభేదాలతో సినిమా విడుదలను ఆపివేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఇలాంటి విషయాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ సినిమా విషయంలో నష్టపోయిన అందరూ బాధితులు కేసులు పెట్టనున్నట్లు తెలిపారు. అక్రమ కేసులు పెట్టే ఎన్. రవికుమార్ రెడ్డి, శేఖర్ రాజుకు ఇదొక గుణపాఠం కావాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News