Wednesday, January 22, 2025

జగ్‌న్‌తో భేటీపై వర్మ వ్యాఖ్యలు వైరల్..

- Advertisement -
- Advertisement -

RGV Tweet on Megastar Team met CM Jagan

ఏపీ సీఎం వైఎస్ జగ్‌న్‌తో గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖుల బృందం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినిమా సమస్యలకు పరిష్కారం లభించిందని, మరో వారం లేదా 10 రోజుల్లో ఏపి ప్రభుత్వం నుంచి జీఓ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్లే ఇది జరిగింది. ఒమెగా స్టార్ వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించారు. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబల్ వైఎస్ జగన్‌ను నేను ఎంతో అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు ఆర్జీవీ. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

RGV Tweet on Megastar Team met CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News