Monday, January 6, 2025

‘పుష్ప2’ ఇడ్లీలు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప2’ మానియా నడుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ పెద్ద ఎత్తున విడుదల కానుంది. అయితే, బుధవారం(డిసెంబర్ 4) నుంచే ప్రీమియర్ షోస్ పడనుండగా.. ఇండియాలోనూ ఇవాళ రాత్రి 9.30 గంటల నుంచి ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇదిలావుంటే.. ఈమూవీ టికెట్ ధరల పెంపుపై సినీ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు చూసేలా టికెట్ ధరలు లేవని.. మేకర్స్ ప్రేక్షకులను దోచుకుంటున్నారని కొందరు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై తన ఎక్స్ వేదికగా ఓ ఇడ్లీ హోటల్ కథ కూడా చెప్పుకొచ్చాడు ఆర్జీవి. కాగా, టికెట్లు భారీగా పెంచినా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం రికార్డు స్థాయిలో అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News