హైదరాబాద్: రాత్రి 10 దాటిన తర్వాత హైదరాబాద్ పబ్బుల్లో సంగీత నిషేధం అన్నది హైదరాబాద్ తాలిబనైజేషన్ కాగలదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. యువతకు కాసింత సంతోషం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్ ను తాలిబన్లు ఏమి పాలించడంలేదు కదా…రాత్రి 10 దాటాక పబ్బుల్లో సంగీతం కూడా లేనందువల్ల నాకు స్మశానం వాతావరణ కనిపిస్తోంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 13న పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశాక రాత్రి 10 తర్వాత పబ్బుల్లో సంగీతం ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. చట్టం అనేది తనకు మాత్రమేకాక జనసామాన్య ప్రయోజనానికని రామ్ గోపాల్ వర్మ గ్రహిస్తే మంచిది. అలాంటి కార్యకలాపాలు చుట్టుప్రక్కల వారికి ఎంత వ్యధ కలిగిస్తాయో కూడా తెలుసుకుంటే మంచిది. వితండవాదంతో సమర్థించుకునే పనిమానేస్తే మంచిది.
NO MUSIC AFTER 10 PM IN HYDERABAD by @oratorgreat https://t.co/1YMcJVe3P2
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2022