Monday, December 23, 2024

ఆసక్తి రేపుతున్న వర్మ ‘వ్యూహం’ టీజర్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం ఉదయం ‘వ్యూహం’టీజర్‌ను విడుదల చేశారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా రాజకీయాల నేపథ్యంలో సినిమాలు తీస్తున్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాలను తీస్తున్నాడని గతంలో ఆయన ప్రకటించారు.

అయితే ముందుగా ‘వ్యూహం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఆయన ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ను వెల్లడించారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News