Thursday, January 23, 2025

వర్మ ‘డేంజరస్’ ప్రమోషన్స్..

- Advertisement -
- Advertisement -

ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ‘డేంజరస్’ (మా ఇష్టం) సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించడం జరిగిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలలో కంపెనీ పతాకంపై ఆయన రూపొందించిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాట్ బ్యూటీ అషూ రెడ్డీ కాళ్ల దగ్గర వాలిపోయిన వర్మ చేసిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పాత్రికేయులతో వర్మ మాట్లాడుతూ.. ‘అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమించుకోవడం అనేది కామన్. ఆ తరహా కథలతో ఇప్పటివరకు వేలాది సినిమాలు వచ్చాయి.

అయితే దానికి భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు ఎలాంటి పరిస్థితులలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయన్న కథనంతో రొమాంటిక్, యాక్షన్ అంశాలు ప్రధానంగా ఈ సినిమాను తీశాం. తెలుగు, హిందీ, తమిళ భాషలలో విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో నట్టి కుమార్ విడుదల చేస్తున్నారు”అని చెప్పారు.

“ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలు రసవత్తర డ్రామాతో సాగుతున్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతున్న పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మలచుకున్నారన్న అంశాలతో ‘వ్యూహం‘ సినిమాను తీయబోతున్నాం. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. దీనికి పార్ట్-2గా ‘శపథం‘ సినిమా చేస్తాను. ఇంకా ఉపేంద్రతో ఓ సినిమా, బిగ్ బి అమితాబచ్చన్‌తో ఒక సినిమా చెయ్యబోతున్నాను”అని వర్మ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News