Friday, December 20, 2024

‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’గా రియా సింఘా

- Advertisement -
- Advertisement -

జైపూర్ : జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా సాధించుకున్నారు. గుజరాత్‌కు చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసు లోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2015 లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా రియా నిలవడం ఆనందంగా ఉందని ఊర్వశీ అభినందించారు. ‘ఈ రోజు నేను టైటిల్ గెలుచుకోవడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.

ఈ పోటీలో పాల్గొనడం కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకున్నాను” అని రియా భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఊర్వశీ మీడియాతో మాట్లాడుతూ … గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. రియా ఆ పోటీల్లోనూ విజేతగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలంతా ఎంతో కష్టపడ్డారు. వారి అంకిత భావం ఆశ్చర్యపరిచింది” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News