Saturday, November 23, 2024

టూరిస్టులపై దూసుకొచ్చిన ఖడ్గమృగం (థ్రిల్లింగ్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: అదవుల్లో వన్యమ్రృగాలను చూసి ఆనందించేందుకు అటవీ శాఖ ఏర్పాటు చేసే సఫారీ ఒక్కోసారి పర్యాటకులు ప్రాణాల మీదకు తెస్తోంది. వన్యప్రాణులు పర్యాటకుల వాహనాలపై దాడి చేస్తే ఏం చేయాలో అటవీ శాఖ అధికారులతోపాటు పర్యాటకులకు కూడా అంతుపట్టని స్థితి ఒక్కోసారి ఉత్పన్నమవుతుంది. అటువంటి పరిస్థితే ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని జల్‌దపారా నేషనల్ పార్కులో జంగిల్ సఫారీ కోసం జీపులో వెళుతున్న పర్యాటకులకు ఎదురైంది. సఫారీ కోసం జీపులో బయల్దేరిన ఆరుగురు పర్యాటకులపై హఠాత్తుగా దాడి చేయడానికి ఒక ఖడ్గమృగం ప్రయత్నించింది.

ఇందుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే థ్ల్ల్రింగా వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ఆకాశ్ దీప్ బధవాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మన దేశంలో అనేక చోట్ల జంగిల్ సఫారీలను అమలు చేస్తున్నారు. ఇవి రాను రాను సాహసోపేతమైన క్రీడలుగా మారిపోతున్నాయి. పర్యాటకులను రక్షించుకోవడం కూడా అటవీ అధికారుల బాధ్యత అంటూ ఆయన ట్వీట్ చేశారు. పర్యాటకుల జీపుపై ఒక ఖడ్గమృగం దూసుకురాగా జీపు డ్రైవర్ వాహనాన్ని వెంటనే రివర్స్ చేశాడు. అయితే జీపు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ దృశ్యాన్ని వెనుకే ఉన్న మరో వాహనంలోని పర్యాటకులు వీడియో రికార్డు చేశారు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 5.7 లక్షల మంది వీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News