- Advertisement -
లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) పట్టుబడ్డాడు. ఈ సంఘటన జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎసిబి డిఎస్‌పి సాంబయ్య కథనం ప్రకారం.. చిల్పూరు మండలానికి చెందిన ఆవుల లింగయ్య తన 1.20 ఎకరాల భూమిని సర్వే చేయమని కోరగా ఆర్‌ఐ వినయ్‌కుమార్ రూ.26 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు ఎసిబి అధికారులకు వివరించాడు. వారి సూచనల మేరకు సోమవారం కార్యాలయంలో ఆ డబ్బులు స్వయంగా తీసుకుంటుండగా ఆర్‌ఐని పట్టుకున్నారు. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి దాడి ఘటన మరువకముందే మళ్లీ దాడి జరగడంతో నియోజకవర్గ కేంద్రంలో చర్చనీయాంశమైంది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎసిబి డిఎస్‌పి తెలిపారు.
- Advertisement -