Tuesday, November 5, 2024

వర్షం కోసం అన్నదాతల ఎదురుచూపు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కారేపల్లి మండలంలో పది రోజుల క్రితం వర్షం పడడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించి, విత్తనాలు నాటారు. తీరా ఎనిమిది రోజులు గడిచినా వర్షం జడ లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఎంతోమంది రైతులు తొలకరి వర్షం కురిశాక, తమ చేలలో పత్తి విత్తనాలు నాటారు. అయితే వర్షం కురియకపోవడంతో, అవి మొలకెత్తుతాయో లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఎర్రబోడు గ్రామపంచాయతీ కోయగుంపుకు చెందిన కరపటి సీతారామయ్య అనే రైతు ఎకరం చేలో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తడం కోసం ఆదివారం తన బోరు మోటార్ ద్వారా పైపుతో నీళ్లు పట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సరికే ఎప్పుడో మొలకెత్తాల్సి ఉందని, ఎంత పైపులతో నీళ్లు పట్టినా వర్షానికి సాటి రాదని, వర్షం రాకపోతే విత్తనాలు మొలవక తాము పెట్టిన పెట్టుబడి వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News