సుల్తానాబాద్: రైస్‌మిల్లర్లు మిల్లింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు ఎఫ్‌సీఐకు రైస్ డెలివరీచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సంబంధిత రైస్‌మిల్లర్లను ఆదేశించారు. గురువారం మండలంలోని సుద్దాల గ్రామంలో గౌరీనాథ్ ఇండస్టీస్, కాట్నపల్లి గ్రామంలోని కనకదుర్గ ఇండస్టీస్‌లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఖరీఫ్ 2022కు సంబంధించి రైస్‌మిల్లింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు ఎఫ్‌సీఐకు రైస్ డెలివరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైస్ మిల్లింగ్ ప్రక్రియ జరుగుతున్న అంశాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. పూర్తి సామర్ధం మేరకు రైస్‌మిల్లులను నడపాలని, సకాలంలో నిర్దేశించిన లక్షం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జూలపల్లి తహసిల్దార్ అబూబకర్, శ్రీరాంపూర్ తహసిల్దార్ ధీరజ్, తదితరులు ఉన్నారు.