Thursday, January 23, 2025

ధాన్య సేకరణలో మిల్లర్లు పాలు పంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

కేంద్రం నిరాకరించినా సిఎం కెసిఆర్
రైతుల ధాన్యం కొంటున్నారు

రైతుకు, మిల్లులకు
సంబంధం ఉండకూడదు,
ఒక్క కిలో తరుగు పెట్టడానికి
వీల్లేదు రాష్ట్ర పౌర
సరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్
పెండింగ్ సమస్యలను
పరిష్కరించండి మిల్లర్లను
దొంగలుగా చూడకండి :
రైస్ మిల్లర్స్ ప్రతినిధులు

మనతెలంగాణ/హైదరాబాద్: రైతులను కేంద్రం నట్టేట ముంచినా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను ఆదుకునేందుకు సంపూర్ణ మద్ధతు ధరతో తెలంగాణ రైతాంగం పండించిన పంటను చివరిగింజ వరకు సేకరించాలని నిర్ణయించారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీనికి రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూ చించారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లైయ్ భవన్‌లో భేటీ అయ్యారు. యాసంగి ధా న్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన స మావేశం సుధీర్ఘంగా కొనసాగింది, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో వారితో మం త్రి గంగుల నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రైస్ మిల్లర్ల ప్రతినిధులకు మంత్రి సూచించారు, మిల్లర్లకు రైతుకు సంబంధం ఎందుకని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామని ఎట్టి పరిస్తితుల్లోనూ ఒక్క కిలోను సైతం మిల్లుల్లో కోత పెట్టవద్దని మంత్రి గంగుల సూచించారు ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి స్పష్టం చేశారు.

వ్యవసాయాన్ని సామాజిక బాధ్యతతో చూడాలి

వ్యవసాయాన్ని వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతతో చూడాలని, ఆదాయం కావాలంటే జీఎస్టీ, ఇన్‌కంట్యాక్స్ వంటి వాటిలో చూసుకోవాలని మంత్రి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. శ్రీలంకలో సంక్షోభం వచ్చినట్టుగా మన దగ్గర కూడా వస్తే ఏ దేశం కూడా మనదేశాన్ని ఆదుకోలేదని అందుకే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ని నీరుగార్చకుండా కనీసం మూడేళ్ల ఏళ్ల ఆహార నిల్వలు ఉంచుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గతంలో సాగు ఇంత జరగలేదని, కరెంటు లేక, అటు రైతులు ఇటు రైస్ మిల్లులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ 24గంటల కరెంటు, సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల రైతు విధానాలతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారరన్నారు. ఒకరికొకరు అనుసంధానంగా ఉండే మిల్లర్లు సైతం బాగుపడే దశలో ఎఫ్‌సిఐ ఏర్పడినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాలను కాలదన్ని కేంద్రం రైతులతో వ్యాపారం చేయడం దురదృష్టకరమని మంత్రి గంగుల ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లింగ్ ఇండస్ట్రీని ఆదుకోవాలి

ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్ల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనం అని అంటే అలర్లు సృష్టించాలన్న కుట్రలతో రైతులను నిండా ముంచి ప్రయోజనం పొందాలని కొందరు చూశారని కానీ, ముఖ్యమంత్రి రైతులను నష్టపోకుండా ఆదుకున్నారని మిల్లర్ల ప్రతినిధులు పేర్కొన్నారు. అదే విధంగా మిల్లింగ్ ఇండస్ట్రీని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొంత మంది మిల్లర్లను దొంగలుగా చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు అందరినీ బాధ్యులను చేయొద్దని వారు సూచించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మిల్లింగ్ ఇండస్ట్రీ యాసంగిలో ఎఫ్‌సిఐ కోరిన మేరకు ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్‌లోడింగ్‌కు కొంతమంది మిల్లర్లు భయపడుతున్నారని మంత్రి దృష్టికి వారు తమ సమస్యలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎఫ్‌సిఐతో ఇబ్బందులను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500 పైచిలుకు బాయిల్ మిల్లులున్నాయని ఎఫ్‌సిఐ, కేంద్రం తీరుతో వీటిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డుపైకొచ్చే పరిస్థితి నెలకొందని మిల్లర్ల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లింగ్ ఇండస్ట్రీ మూతపడితే రైతులకు తీవ్ర నష్టం

రా రైస్ మర ఆడించడం వల్ల ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందని వారు వాపోయారు. నూక, తవుడు వంటివి పోయినా మిగతా షార్ట్ ఫాల్ ఎలా భర్తీ చేయాలంటూ మంత్రి ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లింగ్ ఇండస్ట్రీ మూతపడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు మంత్రితో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. లాభాలు రాకున్నా నష్టపోకుండా చూడాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.

రైస్ మిల్లర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

రైస్ మిల్లర్లు లేవనెత్తిన అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సిఎస్ కమిటీ కచ్చితంగా అందరికీ అనుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి గంగుల వారికి హామినిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కడుపు నింపే వ్యక్తని ఏఒక్కరూ కడుపు కొట్టరని, ఎవరూ ఆధైర్య పడవద్దని, కేంద్రం నిట్ట నిలువునా ముంచినా ఈ కష్ట సమయంలో అందరం సమన్వయంతో పనిచేస్తూ రైతుల్ని కాపాడుకుందామని మంత్రి గంగుల పిలుపు నిచ్చారు. మంత్రి గంగుల మాట్లాడిన తీరుతో మిల్లర్లు ప్రభుత్వానికి సహకరిస్తామని ధాన్యం అన్‌లోడింగ్ చేసుకుంటామని మంత్రితో పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ధాన్యం కొనుగోళ్ల వివరాలతో కూడిన ప్రత్యేక సంచిక విడుదల చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న సివిల్ సప్లైస్ కమిషనర్ మిల్లర్ల సూచనలను పరిశీలిస్తామని, గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, సిఎస్ కమిటీ రిపోర్ట్ ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తూ, యాసంగి పంట సేకరణకు మిల్లర్లు సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మిల్లర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News