Sunday, December 22, 2024

రైతులు మద్దతు ధర పొందాలి: ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

- Advertisement -
- Advertisement -

 

లక్సెట్టిపేట: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జెండావెంకటాపూర్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్, జెండావెంకటాపూర్, బలరావుపేట, గుల్లకోట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతు పంటలకు నీరు, పెట్టుబడి, కరెంట్, ఎరువులు సకాలంలో అందించారన్నారు.

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సీఏసీఎస్ డైరెక్టర్లు, సీఈఓ విష్ణువర్దన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, తెరాస కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News