లండన్: ప్రముఖ నటుడు రిచర్డ్ చాంబర్లీన్(90) కన్నుమూశారు. తన 91వ ఏట అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందే ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. 1960ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘డాక్టర్ కిల్‌డేర్’ టివి సీరియల్‌తో ఆయన ప్రజాదరణ పొందారు. ‘షోగన్’, ‘ది థోర్న్ బర్డ్స్’ సీరియళ్లలో నటించి ఆయన ‘కింగ్ ఆఫ్ ది మినీ సిరీస్’గా పేరు గడించారు. చాంబిర్లీన్ 1934లో కాలిఫోర్నియాలోని బెవర్లి హిల్స్‌లో జన్మించారు. ఆయన నటించిన ‘ది థోర్న్ బర్డ్స్’ సీరియల్‌ను అప్పట్లో 60 శాతం మంది అమెరికాలో చూశారు. ఈ సీరియల్ 16 ఏమ్మీ నామినేషన్లు పొందింది. స్వలింగ సంపర్కుడైన చాంబర్లీన్.. ఆ విషయాన్ని 70 ఏళ్ల వయస్సులో ‘షట్టర్డ్ లవ్’ అనే పేరుతో విడుదలైన తన ఆత్మకథలో వెల్లడించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మార్టిన్ రబెట్‌తో 30 ఏళ్ల రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆయన.. 2010లో విడిపోయారు.
ప్రముఖ నటుడు కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -