Friday, December 20, 2024

తెలుగురాష్ట్రాల ఎంపిలే సంపన్నులు

- Advertisement -
- Advertisement -

ఈసారి లోక్‌సభ అత్యధిక శాతం సుంసన్నులదే. కోట్లు దాటి పడగలెత్తిన వారిదే. ఎంపిలుగా విజేతలైన వారిలో ఈసారి దాదాపు 93 శాతం వరకూ మిలియనీర్లే ఉన్నారని వెల్లడైంది. గత లోక్‌సభతో పోలిస్తే ఇది కొట్టొచ్చేరీతిలో ఉన్న పరిణామం అయింది. ప్రజస్వామిక సంస్కరణల సంబంధిత ఎన్నికల హక్కుల సంస్థ అయిన ఎడిఆర్ తాజా నివేదికతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజేతలైన వారిలో 88 శాతం వరకూ కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 93 శాతానికి చేరిందని సంస్థ సమగ్రరీతిలో సేకరించిన గణాంకాలతో తేల్చింది. అత్యంత సంపన్న ఎంపిల జాబితాలో మొదటి మూడు స్థానాలలో ఉన్నవారిలో తొలి ఒకటి రెండు స్థానాల్లోని వారు తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారే. ఎపిలోని గుంటూరు నియోజకవర్గ ఎంపి టిడిపికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ తొలిస్థానంలో నిలిచాడు. ఆయన ఆస్తుల విలువ రూ 5705 కోట్లు. ఇక తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ ఎంపి ఇప్పుడు బిజెపి తరఫున గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి మొత్తం ఆస్తుల లెక్క రూ 4568 కోట్లు.

కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త , ఇప్పుడు హర్యానాలోని కురుక్షేత్ర నుంచి బిజెపి టికెట్‌పై గెలిచిన నవీన్ జిందాల్ ఆస్తుల చిట్టా రికార్డుల మేరకు చూస్తే రూ 1,241 కోట్లు. ఇప్పుడు గెలిచిన మొత్తం 543 మంది ఎంపిలలో 504 మంది వరకూ కొటీశ్వరులు ఉన్నారు. కోటీశ్వరుల శాతం 2019లో 88 శాతం , అంతకు ముందు 2014 ఎన్నికల దశలో 82 శాతంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికలలో మిలియనీర్ల సంఖ్య 475. సభలో కోటీశ్వరుల ప్రవేశం పరిణామం 2009 నుంచి క్రమేపీ ఎగబాకుతోంది. అప్పట్లో 315 మంది మిలియనీర్లు అంటే 58 శాతం వరకూ సంసన్నులు ఉండేవారని గణాంకాలతో స్పష్టం అయింది. ఇక సంపన్న ఎంపిల క్రమంలో బిజెపిదే పైచేయి అయింది. ఈ పార్టీ నుంచి గెలిచిన 240 మంది ఎంపిలలో మిలియనీర్ల సంఖ్య 227 మంది వరకూ ఉంది. ఇది దాదాపు 95 శాతం అని తేలింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్ 92 శాతంతో అంటే 93 మంది మిలియనీర్లతో నిలిచింది. తరువాతి క్రమంలో డిఎంకె నుంచి 22 మంది మిలియనీర్లు ఎంపిలు అయ్యారు.

ఈ పార్టీ నుంచి గెలిచిన వారి సంఖ్య 27. టిఎంసి నుంచి 34 మంది గెలిచారు. వీరిలో 29 మంది వరకూ కోటీశ్వరులే . సమాజ్‌వాది పార్టీకి చెందిన 37 మంది అభ్యర్థులు తమకు కోటి రూపాయల కన్నా ఎక్కువే ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఆప్ విజేత ఎంపిలలో మొత్తం ముగ్గురు, టిడిపికి చెందిన వారు 16 మంది, జెడియూకు చెందిన వారు 12 మంది కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు.

ధనం మూలం ఇదం విజయం?
ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా మారిందంటే ఎన్నికలలో ఎంతగా దండిగా డబ్బులు పంచగలిగితే అంతగా విజయావకాశాలు ఉంటాయనే విషయం స్పష్టం అవుతోంది. ఈ కోణంలో ఇప్పుడు ఎడిఆర్ చేపట్టిన సర్వేలో అభ్యర్థుల ఆర్థిక వనరులు, వారి స్థిర చరాస్తుల స్థితిగతులను బట్టే వారి గెలుపు సుగమం అవుతోందని, పార్టీలు కూడా ఎక్కువగా ఈ సంపన్నత నేపథ్యం చూసే టికెట్టు కట్టబెట్టే పరిస్థితి ఉందని వెల్లడైనట్లు తాము ఈ కోణంలో జరిపిన అధ్యయనంలో ఇదే తేలిందని ఎడిఆర్ నిర్వాహకులు తెలిపారు. ఈ విధంగా చూస్తే రాజకీయాలు, ఇందులో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నోట్లు, వీటి బరువుపైనే ఆధారపడి ఉంటుందని తేల్చారు. 2024 ఎన్నికలలో అభ్యర్థి ఆస్తుల విలువను బట్టి గెలుపు అవకాశాల ఖరారు అనేది దాదాపు 20 శాతం వరకూ ఉందని నిర్థారణ అయింది.

కోటిరూపాయల తక్కువ సంపన్నత లేకుండా పోటీలోకి దిగిన వారికి గెలుపు శాతం అతి తక్కువగా ఉంటోంది. ఇక ఇప్పుడు విజేతలైన ఎంపిలలోని కోటీశ్వరుల జాబితాలోని వారిలో సంపన్నత విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. విజేతలలో 42 శాతం మంది వరకూ రూ 10 కోట్లు అంతకు మించి ఆస్తులతో ఉన్నారు. 19 శాతం మంది వరకూ రూ 5 కోట్ల లోపు ఆస్తులతో ఉన్నారు. 32 శాతం వరకూ రూ 1 కోటి నుంచి రూ 5 కోట్ల వరకూ ఉన్న శ్రీమంతులే ఉన్నారని నిర్థారణల క్రమంలో తేటతెల్లం అయింది. ఇక లోక్‌సభ గెలుపుగుర్రాలలో ఈసారి రూ 20 లక్షలు అంతకు తక్కువ ఆస్తులు ఉన్నా వారు కేవలం 1 శాతమే అని తేలింది.

ధనవంతమైన పార్టీ టిడిపినే
ప్రస్తుత జాతీయ ఎన్నికల లెక్కలు చూస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సంపన్నత సగటున చూస్తే విజేతకు ఒక్కొక్కరికి రూ 442.26 కోట్లుగా ఉంది. తరువాతి క్రమంలో బిజెపి రూ 50 కోట్లకు పైగా ఉండగా, డిఎంకె 32 కోట్ల సంపన్నతను సంతరించుకుంది. అయితే సంపన్నత విషయంలో పార్టీల అభ్యర్థుల క్రమంలో చూస్తే చాలా వ్యత్యాసాలు కూడా కన్పించాయి. బిజెపికి చెందిన జ్యోతిర్మయ్‌సింగ్ మహతో పశ్చిమ బెంగాల్‌లోని పురులియా నుంచి గెలిచారు. ఆస్తుల విలువ రూ 5 లక్షలు అని ప్రకటించుకున్నారు. టిఎంసికి చెందిన మిటాలిబాగ్ ఆస్తులు కేవలం రూ 7 లక్షలు. ఇక చెల్లించాల్సిన అప్పులు చూపిన ఎంపిలలో కూడా టిడిపికి చెందిన పెమ్మసాని మొదటి స్థానంలో ఉన్నాడు. తాను రూ 1038 కోట్ల బాకీ చెల్లించాల్సి ఉందని తెలియచేసుకున్నారు. తరువాతి స్థానంలో డిఎంకె ఎంపి అరక్కోణం పోటీదారు ఎస్ జగత్త్రచక్కన్ అప్పులు రూ 649 కోట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News