Friday, December 20, 2024

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపీఎల్‌2025లో పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యాడు. గత ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు విఫలమవ్వడంతో.. ఆ జట్టుకు కోచ్ గా ఉన్న పాంటింగ్ ను ఫ్రాంచైజీ వదులకుంది. దీంతో పాంటింగ్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించింది. గత రెండు IPL సీజన్లలో ప్రధాన కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్ స్థానంలో రికీ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, 2008లో T20 లీగ్ ప్రారంభమైనప్పటి నుండి పంజాబ్ కింగ్స్ ఇంకా IPL టైటిల్ గెలవలేదు.

ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌గా పాంటింగ్ నియామకంపై పంజాబ్ కింగ్స్ CEO సతీష్ మీనన్ మీడియాతో మాట్లాడుతూ.. “రాబోయే 4 సీజన్‌లలో మా జట్టును మార్గనిర్దేశం చేయడానికి, స్ట్రాంగ్ గా నిర్మించడానికి ప్రధాన కోచ్ గా పాంటింగ్ ను నియమించడం ఆనందంగా ఉందన్నారు. పాంటింగ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని… అతడి అనుభవం మాకెంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News