Wednesday, January 22, 2025

క్వారంటైన్‌లో పాంటింగ్

- Advertisement -
- Advertisement -

Ricky ponting in Quarantine

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. పాంటింగ్‌తో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్ రావడంతో పాంటింగ్ క్వారంటైన్‌లోకి వెళ్లి పోయాడు. దీంతో శుక్రవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాంటింగ్ సేవలు ఢిల్లీకి అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల కాలంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కరోనా కేసులు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు క్రికెటర్లతో సహా పలువురు సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఢిల్లీ జట్టులో ఒక్కసారిగా కలవరం నెలకొంది. స్టార్ క్రికెటర్లు మిఛెల్ మార్ష్, టిమ్ సిఫర్ట్‌లకు కరోనా సోకింది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటు జట్టు ఫిజియో ఫర్హత్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేగాక మరికొంత మంది సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా పాంటింగ్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News