Tuesday, September 17, 2024

పంత్ పునరాగమనం అద్భుతం: రికీ

- Advertisement -
- Advertisement -

దరాబాద్: ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్  ప్రశంసల వర్షం కురిపించాడు. గత ఐపిఎల్ లో పంత్ ఆడుతాడని అనుకోలేదని, అతడు చాలా దృఢమైన వ్యక్తి అని మెచ్చుకున్నాడు. 2022 డిసెంబర్ నెలలో కారు ప్రమాదానికి పంత్ గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 15 నెలల పాటు పంత్ క్రికెట్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపిఎల్ 2024 సీజన్ లో పంత్ బరిలోకి దిగి 13 మ్యాచుల్లోనే 446 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో ఢిల్లీ జట్టు కోచ్ రికీ స్పందించాడు. పంత్ పునరాగమనం అద్భుతంగా ఉందని, ఇప్పుడు అతడి కాలును చూస్తే ప్రమాదానికి గురయ్యాడా? అనే అనుమానం కలుగుతుందన్నారు.

పంత్ శారీరకంగా, మానసికంగా దృఢమైన వ్యక్తి అని రికీ కితాబిచ్చారు. 2024 ఐపిఎల్ ప్రారంభానికి ముందు బరిలోకి దిగుతానని చెప్పడంతో పాటు తనకేం కాలేదని చెప్పాడని గుర్తు చేశారు. తాము మాత్రం పంత్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ వరకు వినియోగించుకోవాలని అనుకున్నామని, కానీ ప్రతీ మ్యాచ్ లో ఆడడంతో పాటు జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచారని కొనియాడారు. వికెట్ల వెనుక పంత్ ఎప్పుడు హుషారుగా ఉంటూ పక్కవారిని ఉత్తేజ పరుస్తూ ఉంటాడని, మైదానంలో ఫన్నీగా కనిపించిన సీరియస్ క్రికెటర్ అని రికీ ప్రశంసించారు. టి 20 ప్రపంచ కప్ లో పంత్ మూడో స్థానంలో కీలకమైన పరుగులు చేసి జట్టు గెలుపులో తన పాత్ర పోషించాడు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి స్థానం సంపాదించుకున్నాడు. టెస్టుల్లో 30+ టెస్టుల్లో ధనాధన్ బ్యాటింగ్ తో ఐదు సెంచరీలు చేశాడు. మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం 90 టెస్టుల్లో ఆరు సెంచరీలు మాత్రమే చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News