Wednesday, January 22, 2025

స్పోర్ట్స్ ఉమెన్‌గా చేశా

- Advertisement -
- Advertisement -

మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన అందాల తార రిద్ది కుమార్ అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ‘ఫేస్ ఆఫ్ ఇండియా’ అవార్డును గెలుచుకొని తన ప్రతిభను చాటుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్‌లోని ‘లవర్’లో యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు జోడీగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది.ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘అనగనగా ఓ ప్రేమ కథ’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ‘శతమానంభవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ‘కోతికొమ్మచ్చి’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది ఈ భామ. ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిద్దికుమార్ మీడియాతో మాట్లాడుతూ “ప్రభాస్ వంటి బిగ్ స్టార్‌తో ‘రాధే శ్యామ్’లో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో స్పోర్ట్స్ ఉమెన్ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ కోసం నేను ఆర్చరీ నేర్చుకున్నాను. నా పాత్ర బబ్లీగా ఉంటుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాను. ఇందులో నాపై ఎటువంటి సాంగ్స్ ఉండవు. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక రేవతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను.ఇందులో కాజోల్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది.ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఇంకా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News