యారీ వ్యవస్థాపకులు(కుడి నుండి) హరి ప్రసాద్, పరితోష్ వర్మ, ఒఎన్‌డిసి ఎండి కోషి టి, మధన్ బాలసుబ్రమణియన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఓలా, ఉబెర్‌లతో విసిగిపోయారా, ఇప్పుడు ‘యారీ’ అనే స్వదేశీ యాప్- ఆధారిత ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఇది క్యాబ్ డ్రైవర్‌లను సర్వీస్‌కు యజమానులుగా చేసి, వారితో చార్జీలలో ఎక్కువ భాగాన్ని పంచుకోనవసరం లేకుండా పూర్తి చెల్లింపును పొందేలా హామీ ఇస్తుంది. ఒఎన్‌డిసి (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)లో ప్రారంభించిన కొత్త ప్లాట్‌ఫామ్ హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించింది.
డ్రైవర్‌లు ప్లాట్‌ఫామ్‌ను సాఫ్ట్‌వేర్ సేవల ప్రాతిపదికన ఉపయోగించడం కోసం మాత్రమే చెల్లిస్తారు. ఇది ఒఎన్‌డిసిలో అందించినందున బహుళ- మోడల్ సేవలను అందించడంలో సహాయపడుతుంది. ఇది వినియోగదారులను ఆటోలు, క్యాబ్‌లు, మెట్రో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుందని యారీ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు హరి ప్రసాద్ అన్నారు. స్టార్టప్ రోజుకు ఐదు కంటే ఎక్కువ రైడ్‌లు చేసే డ్రైవర్ల నుండి రోజుకు రూ.25 వసూలు చేస్తుంది.
డ్రైవర్లు ప్లాట్‌ఫామ్‌కు ఎటువంటి కమీషన్ చెల్లించనవసరం లేదు, కావున వారు రైడ్‌లను రద్దు చేయకూడదనుకుంటున్నారని, కస్టమర్‌లకు రైడ్‌ను పొందే అవకాశాలు పెరుగుతాయని హరి ప్రసాద్ పేర్కొన్నారు. యారీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు 12,000 ఆటోలు, క్యాబ్‌లను ఆన్‌బోర్డు చేసింది. రానున్న మూడు నెలల్లో మరో నాలుగు నగరాలకు సేవలను విస్తరించనుందని ఆయన వెల్లడించారు.