ప్రాణాలతో మిగిలారు …. ఆ 23 మంది
తిరువనంతపురం: సరదాగా గుర్రపుస్వారీ వెళ్లామనుకున్నారు. కానీ చివరిక్షణంలో ఎందుకులే అనుకుని విరమించుకున్నారు. విశ్రాంతి తీసుకున్నారు. పహల్గామ్‌లో కేరళకు చెందిన 23 మంది సభ్యుల పర్యాటకుల బృందం తీసుకున్న నిర్ణయం వారి ప్రాణాలను నిలిపింది. మంగళవారం నాటి ఉగ్ర దాడుల తరువాతి క్రమంలో సంబంధిత ఉదంతంతో సంబంధం ఉన్న పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ పచ్చిక బయళ్ల ప్రాంతానికి వెళ్లిన తరువాత ఉత్సాహంగా కొందరు బాడుగ గుర్రాలపై చక్కర్లు కొట్టారు. వీరిని ఎంచుకునే ఉగ్రవాదులు కాల్పుల జరిపారు. కేరళ బృందం ఈ ప్రాంతంలో పర్యటించకుండా ఆ రోజు వేరే చోటికి వెళ్లడం ఇందరిని రక్షించిన విషయం అయింది. ఈ పర్యాటక బృందంలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. ఆ రోజు అశ్వికులు ఎక్కువ మొత్తంలో డబ్బుల బేరాలకు దిగడంతో తాము ఈ చోటికి వెళ్లకుండా ఉన్నట్లు బృందంలోని వ్యక్తి ఒక్కరు తెలిపారు.
గుర్రపు స్వారీ వద్దనుకున్నారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -