Wednesday, January 22, 2025

మత హక్కంటే ఇతరులను మతం మార్చే హక్కు కాదు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘మత హక్కంటే ఇతరులను తమ మతంలోకి మార్చుకునే హక్కని కాదు’ అని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. “దేశవ్యాప్తంగా మోసపూరితంగా, తప్పుడు విధానాలతో మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇది నేరం, సీరియస్ విషయం” అని పేర్కొంది. “ మత హక్కంటే ఇతరులను మతం మార్చే హక్కు అని కాదు. ఈ సమస్యను తప్పుడు విధానాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదు” అని తన అఫిడవిట్‌లో వెల్లడించింది. మత మార్పిడులను నిరోధిస్తూ తొమ్మిది రాష్ట్రాలు ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, హర్యాన ఇప్పటికే మత మార్పిడి నిరోధక చట్టాలను చేసినట్లు కూడా కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News