Wednesday, January 22, 2025

సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

కరపత్రాన్ని ఆవిష్కరించినమంత్రి జగదీష్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్‌ః సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 12న సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో నిర్వహించే జాతీయ అవగాహన సదస్సు కరపత్రం ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా. బొమ్మార బోయిన కేశవులు తో కలిసి కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ సమాచార హాక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి అమలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ చ్పట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు జాతీయ అవగాహన సదస్సు నిర్వహించడం అభిందనీయమని వారు అన్నారు.

సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మన్ డా. బామ్మర బోయిన కేశవులు మాట్లాడుతూ 2006లో ప్రారంభించిన తమ సంస్థ సమాచార హక్కు చట్టంపై విసృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి కమిటీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నది అని వివరించారు. ఈ నెల 12 న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించే జాతీయ అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నేబోయిన ఉషారాణి, హైదరాబాద్ జిల్లా కొంశంపేట శ్రీనివాస్, ఉమాకాంత్, కుక్కల వెంకటేష్, మాలోత్ సుందర్ నాయక్,అర్ధం రామ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News