Friday, November 22, 2024

జీవించే హక్కులో సంతానోత్పత్తి కీలకం..దోషికి ఢిల్లీ హైకోర్టు పెరోల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పౌరుల జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. చివరికి ఏదేనీ కేసులో దోషులు అయిన వారి సంతానోత్పత్తి హక్కు కూడా ఇందులో మిళితం అయి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ 41 సంవత్సరాల వ్యక్తికి కోర్టు నాలుగువారాల పెరోల్ ప్రకటించింది.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు వెలువరించింది. వ్యక్తులకు జీవితాన్ని విస్తరింపచేసుకునే హక్కు ఉంటుంది. దీనిని కాదడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జీవిత ఖైదు అనుభవిస్తోన్న వ్యక్తి భార్య రాసిన లేఖపై మానవీయ, శాస్త్రీయ కోణంలో కోర్టు స్పందించింది . 38 ఏండ్ల ఈ మహిళ తనకు తల్లి కావాలన ఉందని, వైద్య ప్రక్రియల ద్వారా భర్త నుంచి గర్భం దాల్చేందుకు అవకాశం కల్పించాలని లేఖలో తెలిపింది.

దీనిని పరిశీలించి న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ దోషికి నాలుగు వారాల విముక్తి కల్పించింది. ఖైదీగా మారినంతనే వ్యక్తులను దిగువ స్థాయి పౌరులుగా ఎంచుకోరాదు. వారికి ఇతరులలాగానే జీవించే హక్కులు , తన తరువాతి తరం కలిగేందుకు అవసరం అయిన సంతానోత్పత్తి క్రమం దక్కించుకునే వీలు కల్పించాల్సిందే. ఇప్పుడు తమ ముందుకు వచ్చిన కేసులో దోషి జీవితకాలం, ఆయన భార్య ఆయుష్షు రెండూ కూడా జైలు జీవితం తరువాతి దశ పూర్తి నాటికి సంతానోత్పత్తి సమయం మించి పోతాయి. దంపతులకు ఓ బిడ్డ కావాలనుకునే హక్కు ఉంది. దీనిని అధికార వ్యవస్థల నిబంధనల పరిధిలో ఎవరూ హరించడానికి వీల్లేదని పేర్కొంటూ ఈ వ్యక్తికి పెరోల్ ఇస్తూ వీరు వినూత్న వైద్య ప్రకియల ద్వారా వీరు సంతానవంతులు కావాలని ఆశిస్తున్నట్లు న్యాయమూర్తి ఆశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News