బెంగళూరు: తమ ఉతత్తుల లేబుళ్లపై హలాల్ సర్టిఫికెట్‌ను ప్రదర్శిస్తున్న ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, అమూల్‌ఫెడ్ డెయిరీ తదితర ప్రభుత్వ రంగ బ్రాండ్లను కొన్ని మితవాద సంస్థలు ఇప్పుడు టార్గెట్ చేశాయి. ఈ సర్టిఫికెట్ ప్రదర్శనను ఆయా సంస్థలు నిషేధించేవారకు తమ ప్రచారం ఆగదని ఈ మితవాద సంస్థలు ప్రకటించాయి. తమ ఉత్పత్తులను ముస్లింలు తినడానికి అనుమతినిచ్చేందుకు మతపరమైన ధ్రువీకరణ కోసం ఆయా కంపెనీలు హలాల్ సర్టిఫికెట్‌ను తమ లేబుళ్ల మీద ప్రదర్శిస్తుంటాయి. హిందూ జనజాగృతి సమితి కర్నాటక రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ ప్రకటించిన పేర్ల జాబితాలో ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తోపాటు చికెన్ ఉత్పత్తులు, సాఫ్ట్ డ్రింకులు, పిండి, చాకొలెట్ డ్రాండ్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రదర్శిస్తున్న హలాల్ సర్టిఫికెషన్‌కు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని గౌడ తెలిపారు. హలాల్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఎవరికీ ఇవ్వలేదని, అయినప్పటికీ కంపెనీలు సర్టిఫికెట్ కోసం ఆరు సంస్థలను ఆశ్రయిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా..హలాల్ వ్యతిరేక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హలాల్ సర్టిఫికెట్‌పై మితవాద సంస్థల ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
- Advertisement -