Friday, November 8, 2024

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ షేర్ల ప్రకటన ఎప్పుడంటే…

- Advertisement -
- Advertisement -

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ 5న  తన బోర్డ్ మీటింగ్ లో 1:1 బోనస్ షేర్లను ఇచ్చే విషయాన్ని పరిశీలించనున్నది. అంటే 1 షేరు ఉన్న ప్రతి ఒక్కరికి మరో షేరు బోనస్ గా దక్కనున్నది. దానికి అదనపు ఖర్చు ఉండదు. ఎక్స్చేంజీకి దాఖలు చేసిన ఫైలింగ్ లో రిలయన్స్ కంపెనీ ఈ బోనస్ షేర్ల విషయాన్ని వెల్లడించింది. నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ షేరు ధర రూ. 3042.90 గా ఉండింది. నేడు రూ. 46.30 పెరిగింది. ఈ కంపెనీ షేరు 52 వారాల(ఇయర్ రేంజ్) గరిష్ఠం రూ. 3217.60గా, కనిష్ఠం రూ. 220.30గా ఉంది. దీని డివిడెండ్ ఈల్డ్ 0.33 శాతం. ఇక పి/ఈ 29.95. మార్కెట్ క్యాపిటలజైషన్ 20.58 లక్షల కోట్లు. గమనించాల్సిన మెలిక ఏమిటంటే బోనస్ షేరనేది అదనంగా ఉచితంగా లభించినప్పటికీ, తర్వాత దాని ధర అడ్జస్ట్ అవుతుంది. అంటే విలువ మాత్రం అంతే ఉంటుంది. అదే ధరలో రెండు షేర్లు ఉన్నట్లు భావించాలి.  ఉదాహరణకు ఒక షేరు ధర రూ. 100 అనుకుంటే, దానికి మరో షేరు బోనస్ అయినప్పడు షేరు ధర రూ. 50గా మారుతుంది. అంటే అప్పడు రెండు షేర్లు ఒక్కోటి రూ. 50 చొప్పున అవుతాయి. అంటే విలువ అదే రూ. 100 గా ఉంటుంది. అయితే  కొంత కాలం గడిచాక ఆ బోనస్ షేరు విలువ పెరిగితే లాభం కలుగుతుంది. దానికి మదుపరులు వేచి ఉండాల్సి ఉంటుంది.

బ్యాలెన్స్ షీట్ ప్రకారం రిలయన్స్ టోటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రూ. 508330.00 కోట్లు గా ఉంది. కాగా షేర్ హోల్డర్స్ ఫండ్స్ రూ 515096.00 కోట్లు గా ఉంది. బోనస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రూ. 5188.89 కోట్లుగా ఉంది. అందుకనే ఈ బోనస్ షేర్లు ప్రకటించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News