Wednesday, November 6, 2024

తొలి దేశీయ స్మార్ట్ టివి ఆపరేటింగ్ సిస్టంను టెస్ట్ చేస్తున్న రిలయన్స్ !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ దీపావళి నాటికి టెలివిజన్‌లను వాణిజ్యపరంగా ప్రారంభించడం కోసం… దేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ టెలివిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ని పరీక్షించడం ప్రారంభించిందని ఇద్దరు పరిశ్రమ అధికారులు తెలిపారు.

గూగుల్  ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన జియో టివి ఓఎస్, సామ్సంగ్ టైజెన్ ఓఎస్, ఎల్జీ వెబ్‌ఓఎస్,  స్కైవర్త్ కూలిటా ఓఎస్,  హిసెన్స్  గ్రూప్ విడా ఓఎస్ అగ్ర టెలివిజన్ తయారీదారు ఓఎస్ తో పోటీపడుతుంది. రిలయన్స్ తన టివి ఓఎస్‌ని కొన్ని హోమ్ గ్రోన్ టివి తయారీదారులకు ఫీడ్‌బ్యాక్,  ఫిక్స్ బగ్‌ల కోసం,  బీటా టెస్టింగ్ కోసం అందించిందని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.

రిలయన్స్ తన స్వంత జియో ఓఎస్ ని నడుపుతున్న 4K , పూర్తి హై డెఫినిషన్ స్మార్ట్ టెలివిజన్‌లను లాంచ్ చేస్తుంది. ఇతర స్వదేశీ టెలివిజన్ తయారీదారులతో లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. రిలయన్స్ బిపిఎల్, రీకనెక్ట్ బ్రాండ్‌ల క్రింద స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. ఈ మోడల్స్ ఎక్కువగా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఉంటాయి.

గత అక్టోబర్‌లో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ కొంతకాలంగా పనిచేస్తున్న స్మార్ట్ టీవీ ఓఎస్‌ను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు, కానీ ఏ వివరాలను తెలుపలేదు. రిలయన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌పై పని చేసింది.

గ్లోబల్ లీడర్‌ల నుండి పోటీ ఉన్నప్పటికీ,  భారతీయ చిన్న బ్రాండ్‌లతో భాగస్వామ్యం చేయడం ద్వారా జియో టివి ఓఎస్ అడాప్షన్(స్వీకరణను) పెంచాలని రిలయన్స్ యోచిస్తోంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News