Wednesday, January 22, 2025

ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు… దెబ్బకు మంచానికి పట్టి 8 కిలోల బరువు తగ్గాడు…

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది చివర్లో గెలిపిస్తే అద్భుతంగా ఉంటుంది. బంతులు వేసిన బౌలర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. గుజరాత్-కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లలో 28 పరుగులు చేస్తే కోల్‌కతా విజయం సాధిస్తుంది. క్రీజులో రింకు సింగ్ ఉన్నాడు. గుజరాత్ నుంచి బౌలింగ్ చేయడానికి యశ్ దయాల్ సిద్ధంగా ఉన్నాడు. యశ్ బౌలింగ్ తొలి బంతికి ఉమేష్ యాదవ్ ఒక పరుగు తీసి రింక్ సింగ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. యశ్ బౌలింగ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

వరసగా ఐదు సిక్స్‌లు బాదాడు. వర్ణించడానికి కూడా పదాలు దొరకనంతగా రింగ్ బ్యాటింగ్ చేశాడు. రింక్ సింగ్ హీరోగా మారితే గుజరాత్ అభిమానుల దృష్టిలో యశ్‌ను విలన్‌గా మారాడు. యశ్ బౌలింగ్ లో గుజరాత్ జట్టు ఓడిపోయిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతా అభిమానులు మాత్రం రింక్ సింగ్ అభిమానించడంలో హద్దులు లేకుండాపోయాయి. యశ్‌పై ఆ ఓవర్ తీవ్ర ప్రభావం చూపడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. అదే సమయంలో వైరస్ సోకడంతో అనారోగ్యం పాలు కావడంతో ఏడు నుంచి ఎనిమిది కిలోల బరువు తగ్గాడు. మళ్లీ యశ్ తిరిగి జట్టులోకి రావడానికి సయమం పట్టే అవకాశం ఉందని గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News