బెంగళూరు: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టి20లో గెలిచి భారత జట్టు ఈ సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది. 212 పరుగులు ఇరు జట్లు చేయడంతో రెండో సూపర్ ఓవర్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులు చేయగా రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర ఓవర్‌లో ఇద్దరు 36 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. టీమిండియా జట్టులోకి వచ్చిన రింకు సింగ్ చివరలో మెరుపులు మెరిపిస్తున్నాడు. నాలుగు వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టు ఆదుకోవడంతో మంచి ఇన్నింగ్స్ నిర్మించినందకు సీనియర్ల నుంచి రింకూ ప్రశంసలు అందుకుంటున్నాడు. కేవలం 15 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి 356 పరుగులు చేయడంతో పాటు మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టి20 వరల్డ్ కప్‌లో అతడిని ఆడించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
సూపర్ ఓవర్‌లో మ్యాచ్ గెలిచిన సందర్భంగా రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. మూడో టి20 మ్యాచ్‌లో రింకూ సింగ్‌తో కలిసి 190 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఎప్పటికీ ప్రత్యేక మైందని రోహిత్ చెప్పారు. షాట్ల గురించి చర్చించుకుంటూ ముందుకు వెళ్లామని, తీవ్ర ఒత్తిడి సమయంలోనూ నియంత్రణ కోల్పోకుండా ఆటను ముగించామని చెప్పారు. ఒకే మ్యాచ్‌లో మూడు సార్లు బ్యాటింగ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదని వివరించారు. టి20ల్లో రింకూ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, అతడి ఆటతీరు పతాకస్థాయికి చేరుకుందని, అతడికి ఉన్న బాలాలు ఏంటో తెలుసునని రోహిత్ చెప్పారు. జట్టు ఏ సమయంలో ఏం అవసరమో గ్రహించి అతడు తన ఆటతీరు మార్చుకుంటున్నాడని ప్రశంసించారు. అలాంటి ఆటగాడు ఇప్పుడు భారత జట్టుకు అవసరమని రోహిత్ చెప్పారు.