Friday, December 27, 2024

రింకూ సింగ్ భారీ సిక్స్..వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియాతో దక్షిణాఫ్రికా మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టి20లో డక్ వర్త్ లూయిస్ ప్రద్దతి ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం వర్షం ఆగిపోవడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152 గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్నిదక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్సోయి 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఈ మ్యాచ్‌లో  యువ బ్యాటర్ రింకూ సింగ్ అదరగొట్టాడు. అతడు బాదిన ఓ భారీ సిక్సర్‌కు మైదానంలో గ్లాస్ పగిలిపోయింది.ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News