Friday, November 22, 2024

ఒక్క ఇన్నింగ్స్ హీరోగా మార్చేసింది..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: విధ్వంసక ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ సంచలనం రింకు సింగ్ ఐపిఎల్‌లో సరిక్తొ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకు సింగ్ చారిత్రక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించాడు. ఇన్నింగ్స్ చివరిలో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ యశ్ దశాల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మలచి కోల్‌కతాకు నమ్మశక్యం కానీ విజయం అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రింకు సింగ్ ఈ ఐపిఎల్ సీజన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిపోయాడు. ఐపిఎల్ చరిత్రలోనే చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగ్ 21 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఒక ఫోరత్‌తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకు సింగ్ ఇన్నింగ్స్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూక్ ఖాన్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు రింకు సింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఆడి కోల్‌కతాకు సంచలన విజయం అందించిన రింకు సింగ్‌ను వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఐపిఎల్ టోర్నమెంట్ ద్వారా రింకు సింగ్ వంటి విధ్వంసక బ్యాటర్ వెలుగులోకి వచ్చాడని, అతను ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని ఆడితే రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించడం ఖాయమని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఇదిలావుంటే రింకు సింగ్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌తో కోల్‌కతా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోగా అప్పటి వరకు గెలుపు బాటలో ప్రయాణించిన గుజరాత్ టైటాన్స్ షాకింగ్ పరాజయాన్ని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News