- Advertisement -
ఢిల్లీ: టీమిండియా టి20 బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ ఇంటి వాడు కాబోతున్నాడు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపి ప్రియ సరోజ్‌ను రింకు పెళ్లి చేసుకోబోతున్నాడు. రింకు, ప్రియకు నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారింది. రింకు కుటుంబ సభ్యులు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారని, కానీ ఇంకా చర్చలు జరుగుతున్నాయని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ పేర్కొన్నారు. నిశ్చితార్థం కాలేదని తుఫానీ పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మచ్చలి షహర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రియ ఎంపిగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్నారు.
- Advertisement -