Sunday, December 22, 2024

రింకూ సిక్స్ కౌంట్ కాలేదు ఎందుకంటే?

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఆస్ట్రేలియాలో జరిగిన తొలి టి 20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి టీమిండియా గెలుపొందింది. రింకూ సింగ్ చివరి బంతిని సిక్స్‌గా మలిచాడు. బంతి నో బాల్ కావడంతో ఒక పరుగు వచ్చింది. టీమిండియా గెలవడానికి ఒక పరుగు అవసరం కావడంతో టీమిండియా గెలిచింది. రింకూ అదే బంతి స్టాండ్‌లోకి పంపించాడు. దీంతో ఆరు పరుగులను అతడి ఖాతాకు జమ చేయలేదు. టీమిండియా ఖాతాలో కూడా జమ చేయలేదు. ఐసిసి పురుషుల టి20లో 16.5.1 నిబంధన ప్రకారం 16.1, 16.2. 16.3 క్లాజుల ప్రకారం ముగింపునకు చేరిన తరువాత వచ్చే పరుగుల పరిగణనలోకి తీసుకోరు. సీన్ అబాట్ నోబాల్ వేయడంతోనే టీమిండియా విజయం సాధించింది. రింకూ సిక్స్ కొట్టిన పరుగులను అతడి, జట్టు ఖాతాలో చేరలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News