హైదరాబాద్: టి20 మ్యాచుల్లో రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పలంటే ఫినిషర్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. చివరి పది టి 20 ఇన్నింగ్స్‌ల్లో రింకూ అత్యధిక స్ట్రయిక్‌రేటు ఉండడంతో రికార్డు సృష్టించాడు. పది ఇన్నింగ్స్‌లలో 176.07 స్ట్రయిక్ రేటుతో 71.75 సగటు కలిగి ఉన్నారు. పది ఇన్నింగ్స్‌లలో మొత్తం 287 పరుగులుతో ఒక హాఫ్ సెంచరీ ఉంది. పది ఇన్నింగ్స్‌లలో ఆరింట్లో నాటౌట్‌గా నిలిచాడు. చివరలో మంచి ఫినిషింగ్ ఇస్తున్నారని క్రికెట్ అభిమానులు అతడిని మెచ్చుకుంటున్నారు. రింకూ త్వరలో టి20ల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ఆశ్చర్యపోనక్కరలేదని అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
రింకూ సింగ్ స్ట్రయిక్ రేటు 176.07, సగటు 71.75
మిస్బాఉల్ హక్ స్ట్రయిక్ రేటు 135, సగటు 67.6
డెవాన్ కాన్వే స్ట్రయిక్ రేటు 151, సగటు 65.43
కెఎల్ రాహుల్ స్ట్రయిక్ రేటు 151, సగటు 56.75
ఆండ్రూ సైమండ్స్ స్ట్రయిక్ రేటు 170, సగటు 56.17
బాబర్ ఆజయ్ స్ట్రయిక్ రేటు 123, సగటు 54.86
పది టి20 మ్యాచ్‌లు:
ఆఫ్ఘనిస్తాన్ 9 నాటౌట్
ఆఫ్ఘానిస్థాన్ 16 నాటౌట్
దక్షిణాఫ్రికా 14
దక్షిణాఫ్రికా 68 నాటౌట్
ఆస్ట్రేలియా 06
ఆస్ట్రేలియా 46
ఆస్ట్రేలియా 31 నాటౌట్
ఆస్ట్రేలియా 22 నాటౌట్
నేపాల్ 37 నాటౌట్
ఐర్లాండ్ 38