Sunday, December 22, 2024

గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న రింకూ సింగ్ తండ్రి! (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ పేరు చెబితే కుర్రకారుకు పూనకాలు వచ్చేస్తాయంతే. రింకూ బరిలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. పైగా ధోనీ తర్వాత అంతటి మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. గత సీజన్ లో 14 ఐపిఎల్ మ్యాచ్ లు ఆడి, 474 పరుగులు చేయడంతో అతని పేరు ఇంటా బయటా మారుమోగిపోయింది. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి కేకేఆర్ కు సూపర్ విక్టరీ అందించిన సంఘటన ఎవరూ మరచిపోలేరు. ఐపీఎల్ లో సత్తా చూపించడంతో తాజాగా టీ20 వరల్డ్ కప్ లోనూ రింకూకు స్థానం లభించింది.

టీమిండియా జట్టుకు ఎంపికైతే చాలు…వారి జీవితం మారిపోతుందంటే సందేహం లేదు. ఆట రూపేణా, ప్రకటనల రూపేణా కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రింకూకి కూడా పారితోషికం బాగానే అందుతోంది. అయితే రింకూ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది. దానికి మించిన పేదరికం ఉంది. రింకూ ఇంత పెద్ద క్రికెటర్ అయినా అతని తండ్రి మాత్రం ఇంకా ఇంటింటికీ తిరుగుతూ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నాడని చెబితే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం.

రింకూ సొంత ఊరు ఉత్తర ప్రదేశ్ లోని అలీఘఢ్. అతని తండ్రి పేరు ఖాన్ చంద్రసింగ్ ఇంటింటికీ ఆటో ట్రాలీలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ ఉంటాడు. తన ఐదుగురు పిల్లల్నీ అలాగే పెంచి పెద్దచేశాడు. మూడో కుమారుడైన రింకూ సింగ్ కు క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న విషయాన్ని గమనించి, అతన్ని ఆ దిశగా ప్రోత్సహించాడు. కొడుకు పెద్ద క్రికెటరైనా ఆయన మాత్రం తన వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు.

దీనిపై రింకూ మాట్లాడుతూ “నేను సంపాదిస్తున్నా కాబట్టి, ఇకనైనా విశ్రాంతి తీసుకోమని నా తండ్రికి చెప్పాను. కానీ ఆయనకు తన పనిలోనే ఆనందం ఉంది. అందుకే తన వృత్తిని వదలటం లేదు. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే తోచదనే ఉద్దేశంతో ఆయన తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. కష్టపడటం అలవాటైన వ్యక్తికి పని చేయొద్దని చెప్పడం చాలా కష్టం. ఆయన తనంతట తానుగా మానాలి, అంతే” అన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News