లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జిల్లా రింకూసింగ్ రాహీ ఇప్పుడు జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో 683వ ర్యాంకుతో విజయం సాధించారు. ఇది తనకు సివిల్స్‌లో చివరి అవకాశం అని, విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.రాష్ట్ర సాంఘిక సంక్షేమ విభాగం అధికారిగా ఉన్నప్పుడు ఆయన రూ 83 కోట్ల స్కాలర్‌షిప్‌ల కుంభకోణాన్ని ఛేదించారు. ఎనమండుగురి అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. వారి నేరం నిర్థారణ అయ్యి వారికి పది సంవత్సరాల జైలు శిక్షలు పడ్డాయి. అప్పుడు రాహీపై దోషి తరఫు దుండగులు దాడికి దిగారు. ఏడు రౌండ్ల కాల్పులు జరపగా ముఖం దెబ్బతింది. కంటిచూపు, వినికిడి శక్తి పోయింది. తన కంటిచూపు పోయినదశలో రాష్ట్రంలోని ఓ ఐఎఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తనకు చాలా ఏండ్లుగా సివిల్ సర్వీసెస్ పరీక్షలలో రాణించేందుకు కోచింగ్ ఇప్పించారు. ఓ వైపు తాను ఉద్యోగిగా ఉంటూనే సివిల్స్ పరీక్షలకు సిద్ధం అయ్యానని , ఇప్పుడు సివిల్స్ పరీక్షలలో ర్యాంకు తెచ్చుకున్నానని తెలిపారు.